Site icon NTV Telugu

పార్టీ మారాలని ఒత్తిడి.. అసభ్య పదజాలంతో పోస్టింగులు!

తెలంగాణ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సభలో తనను అవమానించారంటూ కమలాపూర్ ఎంపీపీ తడుక రాణి ఆందోళన దిగింది. అధికారిక సభకు పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మహిళా ఎంపీపీనైనా తనపై అసభ్య పదజాలంతో ఫేస్‌ బుక్‌ లో పోస్టులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ మారాలని కోరితే వినకపోతే పలువురితో టిఆర్ఎస్ నాయకులే అసభ్య పదజాలంతో పోస్టింగులు పెట్టించారని మండిపడింది. ఈమేరకు ఆమె హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టింది.

Exit mobile version