Site icon NTV Telugu

హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్‌ మనోజ్‌

హెచ్ సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది అపెక్స్ కౌన్సిల్. అజారుద్దీన్ ను ఇటీవలే… హెచ్ సిఏ సభ్యత్వం రద్దు చేసినట్లు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్. ప్రస్తుతం‌ హెచ్ సిఏ వైస్ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ఉన్నారు. ఎవరికి‌ వారే యమునా తీరే అన్న చందంగా హెచ్ సిఏ వ్యవహరిస్తోంది. క్రికెట్ సీజన్ మొదలవుతున్నా గాడినపడని హెచ్ సిఏ వివాదం.

read also :కేంద్రంతో ట్విటర్‌ గేమ్‌ ఆడుతోందా ?

అయితే.. అపెక్స్ కౌన్సిల్ తాజా నిర్ణయంపై మాజీ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్ కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. అపెక్స్ కౌన్సిల్ అనేదే భూటకమని… వాళ్ళు నోటీసులు ఇచ్చినా చెల్లవు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చెల్లవని స్పష్టం చేశారు అజారుద్దీన్‌. Hca కి ఇంకా నేనే ప్రెసిడెంట్ అని…Hca తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ నియామకం చెల్లదని స్పష్టం చేశారు.

Exit mobile version