NTV Telugu Site icon

Jogulamba Gadwal: రూ.30 లక్షలు పట్టుకుని రూ. రెండు లక్షలు చూపించారు.. పోలీసులపై వేటు..

Jogulamba Gadwal Jilla

Jogulamba Gadwal Jilla

Jogulamba Gadwal: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన పేకాట వ్యవహారంలో పోలీసులపై పలు అవినీతి ఆరోపణల ఉన్నతాధికారులు స్పందించారు. అందులో భాగంగా ముగ్గురు పోలీస్‌ అధికారులపై వేటు వేస్తూ, మల్టీజోన్‌-11 ఐజీపీ వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

Read also: Sri Shirdi Sai Chalisa: సాయి చాలీసా వింటే మానసిక రుగ్మతల నుండి బయటపడతారు

జరిగింది. ఇదీ..

ఉండవల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కర్నూల్‌ జిల్లాకు చెందిన కొంతమంది పేకాట రాయుళ్లు పేకాట ఆడుతుండగా జిల్లా పోలీస్‌ బృందం దాడి చేసింది. ఆ సందర్భంగా వారి నుంచి దాదాపు రూ.30 లక్షలు పట్టుకుంటే కేవలం రూ. రెండు లక్షల పైచిలుకు నగదును చూపించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులతో విచారణ చేయించిన తర్వాత ముగ్గురు పోలీస్‌ అధికారులపై చర్యలకు ఐజీపీ వి.సత్యనారాయణ చర్యలు తీసుకున్నారు. వారిలో జోగుళాంబ గద్వాల జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ జములప్ప, మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట ఎస్‌ఐ విక్రంకు పేకాట రాయుళ్లతో పరోక్ష సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

Read also: UP IAS Transfers: యోగి మార్క్ పరిపాలన.. యూపీలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

అలాగే ఉండవల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు తన స్టేషన్‌ పరిధిలో అంత పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నా జిల్లా పోలీస్‌ పార్టీ దాడి చేసే వరకు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారణ కావడంతో ఆ ముగ్గురిని తక్షణమే విధుల నుంచి తొలగించి, వీఆర్‌లో పెట్టారు. వారిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ఇటీవలే టూరిజం శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల, గట్టు ప్రాంతాల సందర్శన సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణను పూర్తిగా నిలువరించనందున గద్వాల సీఐ భీంకుమార్‌ను మల్టీజోన్‌-11 వీఆర్‌కు అటాచ్‌ చేశారు.
Vishwambhara : అర్ధరాత్రి ‘విశ్వంభర’ ట్రీట్

Show comments