NTV Telugu Site icon

Strange incident: భూపాలపల్లిలో వింత ఘటన.. ఇళ్లలో అకస్మాత్తుగా మంటలు

Bhupalapalli

Bhupalapalli

Strange incident: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇళ్లల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఉదయం చెలరేగడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సమయంలో ఇంటి మంటలు చెలరేగాయి దీంతో ఇంటిలో వున్న వారు నిప్పును ఆర్పేశారు. ఏదైన షార్ట్‌ షర్య్కూట్‌ అయి ఉంటుందని లైట్‌ తీసుకున్న కుటుంబ సభ్యులకు మరోరోజు కూడా అంతకుముందు రోజు ఎక్కడైతే మంటలు చలరేగాయో మళ్లీ అక్కడే మంటలు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌ కు గురయ్యారు. నాలుగు రోజులుగా మంటలు చెలరేగుతుండంతో ఇక కుటుంబ సభ్యుల్లో భయం మొదలైంది. భయంతో బిక్కు బిక్కు మంటూ ఇంట్లో గడుపుతున్నారు.

Read also: Phone pe: ఫోన్ పే నుంచి ఈజీగా లోన్ ను ఎలా పొందాలో తెలుసా?

మల్హర్ మండలంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన మందపెల్లి పోచయ్య ఇంట్లో నాలుగు రోజులుగా అకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్నాయి. గత శనివారం నుంచి మంగవారం వరకు ప్రతి రోజూ ఉదయం 8 గంటల ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఇంట్లో వస్తువులు కాలిపోతున్నాయని బాధిత కుటుంబం సభ్యులు చెబుతున్నారు. మంటల అకస్మాత్తుగా వస్తుండటంతో బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం రోజూ లాగా వారందరూ ఇంటి పని చేస్తుండగా మాటి మాటికి ఎక్కడైతే మంటలు మొదలవుతున్నాయో అక్కడే మళ్లీ నిప్పు చెలరేగుతుందని, దాని వల్ల వస్తువులు కాలి బూడిదవుతున్నాయని వాపోతున్నారు. అసలు వారి ఇంట్లో ఏం జరుగుతుందో అన్నట్లు భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు ఇలాగే మంటలు అంటుకోవడం వలన షార్ట్‌సర్య్కూట్‌ వల్ల వచ్చిందనుకున్నాము కానీ.. నాలుగు రోజుగే జరుగుతుందని భయంగా వుందని వాపోతున్నారు.

దీనిపై రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చామని తెలిపారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకొన్న రెవెన్యూ సిబ్బంది వివరాలు సేకరించారని తెలిపారు. మంటలు చెలరేగడానికి భూ గర్భ గ్యాస్ లీకేజా.., లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉందని తెలిపారని అన్నారు. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్నాయనే వార్త దావనంలా వ్యాపించడంతో తాడిచెర్ల గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అధికారులు స్పందించి మంటలకు గల కారణాలు తెలుసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాగే భూ గర్భ గ్యాస్ లీకేజ్‌ అయితే మండలంలోని ప్రజల పరిస్థితి ఏంటని భయాందోళన చెందుతున్నారు. ఇళ్లలో మంటలు చలరేగి మనషుల ప్రాణాలకు ప్రమాదమవతుందని వాపోతున్నారు. త్వరలో అధికారులు మంటలకు గల కారణాలు తెలుసుకుని ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.
Hair: మీ జట్టు పెరగాలంటే రైస్ వాటర్ తో అది చేస్తే చాలు..!