NTV Telugu Site icon

Bandi Sanjay: 12వ రోజుకు చేరిన బండిసంజయ్‌ పాదయాత్ర.. యూసుఫ్ నగర్ లో రాత్రి బస

Bandi Sanjay Yusuf Nagar

Bandi Sanjay Yusuf Nagar

Bandisanjay Padayatra reached 12th day: జగిత్యాల జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది. కోరుట్ల నియోజకవర్గంలోని వేంపేట గ్రామ శివారులోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. మెట్ పల్లి,ఆరాపేట్, చెవుల మద్ది క్రాస్ రోడ్స్, చింతలపేట మీదుగా యూసుఫ్ నగర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ 3.6 కిలోమీటర్ల మేర ప్రజా సంగ్రామ యాత్ర జరగనుంది. యూసుఫ్ నగర్ లో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.

Read also: Students Suspend: బురఖాలు ధరించి డ్యాన్సులు.. 4గురు విద్యార్థులు సస్పెండ్

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా సీఎం కేసీఆర్‌కు ఓ సవాల్ విసిరారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తేల్చి చెప్పారు. ఒకవేళ నిరూపించకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కేసీఆర్ సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నట్టు.. మోటార్లకు మీటర్లు పెడతామని బీజేపీ చెప్పలేదని, ఒకవేళ పెడితే దానికి తానే బాధ్యత తీసుకుంటానని అన్నారు. లేని పక్షంలో ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. గుజరాత్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓడించక తప్పదన్నారు. అభివృద్ధి చేసే వారే గెలుస్తారని బండి సంజయ్ అన్నారు. అవినీతిపరులు పతనం అవుతారని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న సిర్పూర్, నడికుడ, రాఘవపేట, హుస్సేన్ నగర్, ముత్యంపేట మీదుగా వేంపేట వరకు కొనసాగింది. బండి సంజయ్ వేంపేట సమీపంలో రాత్రి బస చేశారు. బండి సంజయ్ పాదయాత్ర నిన్న మొత్తం 12.6 కిలోమీటర్ల మేర కొనసాగింది.
Christmas Effect on Stock Market: ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ చైర్మన్‌ ఆర్‌.వెంకటరామన్‌ అంచనా