Site icon NTV Telugu

మంత్రి కేటీఆర్‌కు వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం ఆహ్వానం..

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు…. మ‌రోసారి వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. దావోస్‌లో 2022లో జ‌రిగే WEF వార్షిక స‌మావేశానికి… హాజరు కావాల‌ని కేటీఆర్‌ను WEF ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ఆహ్వానించారు. ఈ స‌మావేశం జ‌న‌వ‌రి 17 నుంచి 21 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. తెలంగాణ‌ను సాంకేతిక శ‌క్తి కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న కృషిని బోర్గే బ్రెండే ప్రశంసించారు. WEF నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్యక్తం చేశారు. ఐటీ, ఇన్నోవేష‌న్ రంగాల్లో… తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల‌కు గుర్తింపుగా… ఈ ఆహ్వానాన్ని భావిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.

Exit mobile version