Inter 2nd Year Exams: తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మార్చి 19 వరకు కొనసాగనున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రతి రోజు ఆ తేదీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మొత్తం 9,80,978 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో మొదటి సంవత్సరం నుంచి 4,78,718 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. సెకండియర్ పరీక్షలకు హాజరవుతున్న వారిలో 58,071 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Read also: Madhyapradesh : మధ్యప్రదేశ్ లో భారీ రోడ్డు ప్రమాదం, 14 మంది మృతి, 20 మందికి గాయాలు
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్..
➥ 29-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
➥ 02-03-2024: ఇంగ్లీష్ పేపర్-II
➥ 05-03-2024: గణితం పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
➥ 07-03-2024: గణితం పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
➥ 12-03-2024: ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II
➥ 16-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-II
➥ 19-03-2024: మోడరన్ లాంగ్వేజ్ పేపర్-II, జాగ్రఫీ పేపర్-II
Telangana Temperatures: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు.. సాధారణంగా కంటే మూడు డిగ్రీల అధికం
