NTV Telugu Site icon

Nizamabad: క్లినిక్ లపై తెలంగాణ వైద్య బృందం తనిఖీలు.. నకిలీ వైద్యుల గుట్టు రట్టు..

Nizamabad

Nizamabad

Nizamabad: నిజమైన వైద్యులు పోయేప్రాణాలను కాపాడితే.. ఆరోగ్యంగా ఉన్న అమాయకుల ప్రాణాలను హరిస్తున్నారు నకిలీ వైద్యులు. ఎలాంటి విద్యార్హతలు లేకుండానే నకిలీ సర్టిఫికెట్లతో మురికివాడలు, కాలనీల్లో క్లినిక్ లు ఏర్పాటు చేసి తాము అందిస్తున్న సేవలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. అనారోగ్యంతో తమ వద్దకు వచ్చే రోగులకు అవసరానికి మించి యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ దందా ఎక్కువైంది. కొంతమంది ఒకే దవాఖానల్లో ఇన్ పేషెంట్లకు బెడ్లు కూడా ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి విద్యార్హతలు, వైద్య విద్య లేకుండానే కొందరు వైద్యులుగా చలామణి అవుతూ ఎంతో మంది ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఇలాంటి క్లీనిక్, నకిలీ వైద్యులపై తెలంగాణ వైద్య మండలి బృందం ఉక్కుపాదం మోపింది. ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్లినిక్ లపై తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్, బాన్సువాడలో రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. కనీస విద్యార్హత లేకుండా ఆధునిక వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుల గుట్టు రట్టు చేశారు. విచ్చలవిడిగా యాంటి బయాటిక్స్, పైల్స్ కు ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు గుర్తించారు. 30 సెంటర్లలో తనిఖీలు నిర్వహించి 15 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. నకిలీ డిగ్రీ, డీబీఎంఎస్ ల పేరుతో క్లినిక్ ల నిర్వహణ చేపట్టినట్లు గుర్తించారు. నకిలీ వైద్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Adani Group: అమెరికాలో కేసులపై అదానీ గ్రూప్ క్లారిటీ..