NTV Telugu Site icon

Cesarean infection: మళ్లీ బాలింతలకు అస్వస్థత.. సిజేరియన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ తో అవస్థలు

Jagityala Distric

Jagityala Distric

Cesarean infection: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ఆరుగురు బాలింతలకు అస్వస్థత గురయ్యారు. సిజేరియన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ తో బాలింతలు అవస్థలు ఎదుర్కొన్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని బందువులు వాపోతున్నారు. బాలింతలనే కనికరం లేకుండా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సిజేరియన్‌ చేసిన ఇన్షెక్షన్‌ అయ్యిందని దానివల్లే బాలింతలు నరకయాతన పడుతున్నారని వాపోయారు. ఇలా ఒకరు, ఇద్దరు కాదని ఆరుగురు గర్భణీలకు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాతా శిశు కేంద్రంలో అన్ని ఏర్పాట్లు ఉన్నా వైద్యులు నిర్లక్ష్యం మాత్రం అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎవరు లేరని అందుకే వైద్య సిబ్బంది తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుందని అవస్థకు గురవుతున్న గర్భణీకుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం స్పందన ఎలా ఉండనుందనేది ఉత్కంఠంగా మారింది.

Read also: Tollywood: 20 రూపాయల కోసం మీ చుట్టూ తిరగాలా?

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో వైద్యం వికరించింది మాధవి అనే యువతి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మాధవి చనిపోయిందని మహిళ బంధువులు ఆసుపత్రి మీద దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రి సూపర్డెంట్ వెంకటేశ్వర్లపై దాడి చేయడంతో సూపర్డెంట్ ని పోలీసుల సంరక్షణలో బయటకు తీసుకెళ్లారు. రెండు రోజులకి ఆసుపత్రిలో మాధవి అనే మహిళకి ముక్కు ఆపరేషన్ చేయగా వైద్యం వికటించి ఆమె మృతి చెందింది. ఈ ఘటంలో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మృతుని బంధువులు ఆసుపత్రిలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ వెంకటేశ్వర్ల పై బంధువులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సూపర్డెంట్ ని ఘటనాస్థలం నుంచి తరలించారు.

Read also: Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌

ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లా లోని కామేపల్లి మండలం సాతనుగూడెంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో హాస్పిటల్ లో మమత అనే గర్భణీ మృతి చెందింది. ఖమ్మం మాతా శిశు కేంద్రంలో మృతురాలికి నార్మల్ డెలివరీ కాగా.. డెలివరీ పూర్తయిన తర్వాత మమతకు పొట్ట భాగంలో కుట్లు వేశారని.. ఆ కుట్లు సరిగా వేయకపోవడంతో తీవ్ర సమస్యతో బాధ పడుతున్న మమతను హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకున్న వైద్యులు మమతకు మెరుగైన వైద్యం అందించకపోవడంతో మమత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో.. మృతి చెందిన విషయాన్ని వైద్యులు చెప్పకుండా గోప్యంగా ఉంచారని.. అత్యవసరమని చెపితే తమ బిడ్డను ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి బ్రతికించుకునే వాళ్లమని వాపోయారు. మమత మృతి చెందినట్లు ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత మృతికి కారణమైన వైద్యులను సస్పెండ్ చేయాలని ఆందోళ చేశారు. అంతేకాకుండా.. మమత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాత శిశు కేంద్రం వద్ద కుటింబికులు ఆందోళన చేపట్టారు.
Ease Of Living: దేశవ్యాప్తంగా టాప్-10లో ఏపీ నుంచి మూడు పట్టణాలకు చోటు