Hyderabad Hydra: తెలంగాణలో హైడ్రామా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడం సంచలనం రేపుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరి ఇంటిని హైడ్రా వదలడం లేదు. ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేయడం షాకింగ్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ జయభేరి సంస్థకు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని రంగలకుంట చెరువులో జయభేరి సంస్థకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది.
Read also: Bhatti Vikramarka: వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అర్ధరాత్రి 1 గంట వరకు బాధితులతో భట్టి ముఖాముఖి
15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులులో పేర్కొన్నారు. లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని నోటీసులో తెలిపారు. ఫైనాన్షియల్ జిల్లాలోని రంగళాల్ కుంట చెరువులోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలను తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే హైడ్రా జారీ చేసిన నోటీసులపై జయభేరి సంస్థ ఇంకా స్పందించలేదు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్‌ను హైడ్రా కూల్చివేసి దుర్గంచెరువు బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Pregnant Women Food: గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు అసలు తినకూడదు తెలుసా..?