NTV Telugu Site icon

VC Sajjanar: ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖాతాలు ఖాళీ.. న్యూ ఇయర్‌ విషెష్‌పై సజ్జనార్‌ ట్వీట్‌..

Vc Sajjanar

Vc Sajjanar

VC Sajjanar: కొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. అయితే కొత్త సంవత్సర వేడుకలపై సైబర్‌ కేటుగాళ్లు ఫోకస్‌ పెట్టారు. న్యూయర్‌ విషెస్‌ అంటూ అమాయకులను దోచోస్తున్నారు. దీనిపై ముందుగానే అలర్ట్‌ అయిన సైబర్‌ క్రైం అధికారులు ప్రజలకు తగు సూచనలు జారీ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలకు సీనియర్ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.

Read also: MLC Kavitha: రిజర్వేషన్లు తేల్చకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..

నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్లాన్ వేశారని, అలర్ట్‌గా ఉండాలని తెలిపారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తి గత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందన్నారు. న్యూ ఇయర్ విషెస్ చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని ఇతరులకు పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని స్మార్ట్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవన్నారు.

Read also: Telangana Rains: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..

ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్(ఏపీకే) ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి ఫోన్లోకి జొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ల అధీనం లోకి వెళ్లిపోతుందన్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ తీసేసుకుంటారు. కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు రాబోయే రెండు, మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది.. జాగ్రత్త!! అంటూ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.
Mahesh Kumar Goud: జనవరి 3 వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు..

Show comments