Ujjaini Mahankali Bonalu: ఆషామాసం బోనాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని చెబుతారు. అందుకే బోనాలు ఘనంగా జరుపుకుంటారు. బోనం అంటే భోజనం అని అర్థం. ఆహారాన్ని (నైవేద్యాన్ని) ఒక కుండలో అమ్మవారికి తీసుకెళ్ళి, అమ్మవారికి సమర్పించి, ప్రసాదంగా ఇంటికి తీసుకువస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. తమ ఇంటి సంప్రదాయాల ప్రకారం బోనాలు జరుపుకుంటారు.
Read also: Terrorist Attack: రాజౌరిలోని ఆర్మీ క్యాంపుపై కాల్పులు.. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్
ముఖ్యంగా.. గోల్కొండ, బల్కంపేట్ ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, పాతబస్తీ సింహవాహిని, చార్మినార్ సమీపంలో తదితర ప్రాంతాల్లో బోనాలు భక్తులు ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారికి బోనం, తొట్లెలు, తినుబండారాలు సమర్పిస్తారు. దీంతో అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కాగా, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో రెండు రోజుల పాటు బోనాల పండుగ జరగనుంది. తొలిరోజు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు నగరం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఉదయం నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. కాగా, ఉజ్జయిని మహంకాళి ఆలయం సమీపంలో రెండో రోజు ఫలహారాల బండ్ల ఊరేగింపు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు, క్షేత్ర కార్యక్రమాలు జరగనున్నాయి.
Read also: Budget 2024: బడ్జెట్‌లో ఎన్‌పిఎస్, ఆయుష్మాన్‌పై భారీ ప్రకటనలు
భక్తులు ముఖ్యంగా రంగం భవిష్యవాణిని నమ్ముతారు. ఉజ్జయినీ అమ్మవారు రంగం చెప్పే మహిళలో పూనుతారని చెబుతుంటారు.
సాధారణంగా కుండ పచ్చిగా ఉంటుంది. కాస్త అజాగ్రత్తగా వున్న కుండ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే అలాంటిది ఉజ్జయిని ఆలయంలో రెండోరోజు సాయంత్రానికి రంగం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత అనే జోగిని ప్రతి సంవత్సరం కూడా రంగం చెబుతుంది. ఆమె శరీరం మొత్తం పసుపు, వేప ఆకులు , ఆమెకు చూస్తే కాస్త భయం కల్గించే విధంగా ఉంటుంది. అమె అమ్మవారి ఆలయం వద్దకు వస్తున్నప్పుడు ఆమె రాకకోసం అందరూ పక్కకు జరుగుతారు. ఆమెకు ఎవరు అడ్డుగా రారు. అనంతరం అక్కడ పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెబుతుంది. అమ్మవారు ఆమెలో ప్రవేశించడనడానికి అదే నిదర్శనమి భక్తులు చెబుతుంటారు. దీని కోసం రాజకీయ నాయకులు, భక్తులు భవిష్యవాణి వింటారు. ఈరోజు జోగిని అమ్మవారి ఏం చెప్పబోతోందనే దానిపై ఆశక్తి నెలకుంది.
Kamala Harris: అమెరికా రాజకీయాల్లో మనోళ్ల సత్తా.. ఉన్నత పదవుల్లో ఇండో అమెరికన్స్!