Lecturers Transfer: రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి లెక్చరర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారందరినీ తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో సిబ్బంది బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సోమవారం విడుదల చేశారు. నేటి నుంచి (ఈ నెల 16) 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 30వ తేదీ వరకు ఒకే స్టేషన్‌లో ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారందరినీ బదిలీ చేయాల్సి ఉంటుందని, అదే సమయానికి రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక జూన్ 30, 2026 లేదా అంతకు ముందు పదవీ విరమణ పొందిన వారికి బదిలీల నుండి మినహాయింపు ఉంటుంది. ఒక పోస్టులో రెండేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
Read also: Mahesh Babu Birthday: మొత్తానికి మహేష్ బర్త్డే ట్రీట్ రెడీ చేశారు..
గతేడాది ఏప్రిల్‌లో దాదాపు 3 వేల మంది కాంట్రాక్ట్ టీచర్లు రెగ్యులర్ అయ్యారు. రెండేళ్లు పూర్తికాకపోవడంతో బదిలీలు లేవు. డిగ్రీ కాలేజీల్లో 1517 అధ్యాపక పోస్టులు ఉండగా.. దాదాపు 900 మంది బదిలీ అయ్యే అవకాశం ఉందని అంచనా. ఆన్‌లైన్‌లో బదిలీలు జరగనున్నాయి. ప్రత్యేక కేటగిరీలో జీవిత భాగస్వామి ఉద్యోగికి 20 పాయింట్లు, 70 శాతం వైకల్యం ఉన్న ఉద్యోగులకు 15 పాయింట్లు, ఒంటరి మహిళలు/వితంతువులు/విడాకులు పొందిన మహిళలకు 10 పాయింట్లు, న్యూరోసర్జరీ, క్యాన్సర్, కిడ్నీ/లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టీబీ పాయింట్లతో బాధపడుతున్న ఉద్యోగులకు 20 పాయింట్లు. ఈ సమస్యలతో బాధపడుతున్న జీవిత భాగస్వామి/పిల్లలు పది పాయింట్లు పొందుతారు. బదిలీల షెడ్యూల్ విడుదల చేయడంపై లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేసి ఏడాదిన్నర క్రితమే రెగ్యులర్ అయిన వారికి బదిలీలకు అవకాశం ఇవ్వక పోవడం గమనార్హం.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్