Site icon NTV Telugu

Group-1 Exam Day 3: తెలంగాణలో మూడో రోజు గ్రూప్-1 పరీక్ష..

Group 1 Exam Day 3

Group 1 Exam Day 3

Group-1 Exam Day 3: నేడు తెలంగాణలో మూడో రోజు గ్రూప్‌-1 పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. రెండు రోజులు ప్రశాంతంగా కొనసాగిన గ్రూప్‌ 1 పరీక్షలు. నేటితో మూడోరోజుకు చేరింది. కాగా..తెలంగాణలో తొలిరోజు నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగియగా, తొలిరోజు పరీక్షకు 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష హాలులోకి అనుమతించాలని అధికారులు స్పష్టం చేశారు. రెండురోజులు 22 వేల 744 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా… మొత్తం 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొదటి రోజు కొంతమంది విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనందున పరీక్షకు అనుమతించలేదు అధికారులు. దీంతో మొదటి రోజు అభ్యర్థులు రాయలేకపోయారు. పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించకపోవడమే తప్ప ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలు లేవని టీజీపీఎస్పీ పేర్కొంది. హైదరాబాద్‌లో 5 వేల 613 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 87.23 శాతం మందికి గాను 4 వేల 896 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాశారు. మరో 717 మంది గైర్హాజరయ్యారు. రంగారెడ్డి పరిధిలో 8 వేల 11 మందికి గాను 5 వేల 854 మంది పరీక్ష రాశారు. మరో 2 వేల 157 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఈ నెల 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ కొనసాగనున్న నేపథ్యంలో అన్ని పరీక్షలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని టీజీపీఎస్పీ భావిస్తోంది.
South Korea Tour: సియోల్ లో AI సిటీని సందర్శించనున్న తెలంగాణ అధికార బృందం..

Exit mobile version