Final list of voters: ఓటర్ల తుది జాబితాపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు. గత నెల 29న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 3,34,26,323 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. 8 లక్షల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని స్పష్టత ఇచ్చారు. 4.14 లక్షల ఓటర్లను తొలగించామన్నారు. యంగ్ ఓటర్లు 4,73,838 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణలో 551 పోలింగ్ కేంద్రాలు పెరిగాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 35,907 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఓటర్ జాబితపై అభ్యంతరాలను ఈనెల 28 వరకు స్వీకరిస్తామని తెలిపారు. జనవరి 6న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని అన్నారు. ఈనెల 9,10 తేదీల్లో ఓటర్ల నమోదు స్పెషల్ క్యాంపెన్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. బిఎల్ఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ స్టేషన్ లలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు లేదని చెప్పారు.
KTR Tweet: ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..
Final list of voters: తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి కీలక ప్రకటన.. ఓటర్ల తుది జాబితాపై స్పష్టత..
- ఓటర్ల తుది జాబితాపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన..
- గత నెల 29న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించామని తెలిపారు..
Show comments