NTV Telugu Site icon

Telangana Assembly 2024 LIVE: నేడు 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

Telangana Assembly 2024

Telangana Assembly 2024

Telangana Assembly 2024 LIVE: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు 7వ రోజుకు చేరాయి. ఈనెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ రెండవ రోజు (సోమవారం) ప్రారంభమైన అసెంబ్లీ.. ఇవాల్టి (శనివారం)తో 7వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరగనుంది. నేడు ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభలో నేరుగా రైతు భరోసాపై చర్చించనున్నారు. దీంతో సభ్యులు అందరూ రైతు భరోసా నిధుల విడుదల మాట్లాడనున్నారు. అటు రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ లో కొత్త విద్యుత్ పంపిణీ పాలసీ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందుబాటులో ఉండే దాన్ని సభలో చర్చించే ఛాన్స్‌ ఉంది. మరోవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం తెలుపనుంది. హైదరాబాద్ లో గత సంవత్సర కాలంగా మౌళిక వసతుల కల్పనలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం వైఫల్యం అయింది అంటూ బీఆర్ఎస్ వాయిదా తీర్మానం కోరింది.

No liveblog updates yet.
Show comments