NTV Telugu Site icon

Medical Services: నిలిచిన వైద్యసేవలు.. అత్యవసర పరీక్షలు సైతం అందక గర్భిణీల అవస్థలు

Stopped Medical Services

Stopped Medical Services

Medical Services: కోల్‌కతాలో డాక్టర్‌పై జరిగిన ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని జూనియర్ డాక్టర్లు బుధవారం నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది కూడా నిరసనల్లో పాల్గొనడంతో నిలోఫర్, ఉస్మానియా, ఈఎన్‌టీ వంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడ్డారు. నిలోఫర్ ఆస్పత్రిలో ఉదయం 11 గంటల వరకు మాత్రమే గైనకాలజీ ఓపీ సేవలు నిర్వహించారు. దీంతో చాలా మంది గర్భిణులు వైద్యం చేయించుకోకుండా వెనుదిరిగారు.

Read also: Sitarama Project: దశాబ్దాల సాగు నీటి కల సాకారం.. సీతారామ ప్రాజెక్ట్‌ కు సీఎం రేవంత్ ప్రారంభోత్సవం..

జిల్లాల నుంచి రెఫరల్‌పై వచ్చిన రోగులకు నిలోఫర్‌లో అత్యవసర పరీక్షలు కూడా అందలేదు. అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, 2డీ ఎకో, ఎక్స్‌రే, శాంపిల్ సేకరణలో టెక్నీషియన్లు, సిబ్బంది లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది రోగులను తిరిగి వార్డులకు తరలించారు. నాలుగు రోజుల క్రితం అడ్మిట్‌ అయ్యి వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన రోగులను కూడా వెనక్కి పంపించారు. దీంతో కొంత మంది ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా ఆర్‌ఎంఓలు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు స్పందించి అత్యవసర రోగులకు పరీక్షలు నిర్వహించాలని భద్రతా సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో నిత్యం 200 మందికి స్కానింగ్‌ చేస్తున్నారు. బుధవారం 60 మంది రోగులకు మాత్రమే చికిత్స అందించగా, గురువారం సతంత్య్ర దినోత్సవం కావడంతో శుక్రవారం రావాలని రోగులను వార్డులకు తిప్పి పంపారు.
DSC Recruitment Process: సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ..?