NTV Telugu Site icon

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పాముల కలకలం..

Shamshabad Airport

Shamshabad Airport

Shamshabad Airport: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు పట్టుబడటం కలకలం సృష్టించాయి. ఎప్పుడు ఎయిర్ పోర్టులో బంగారం, డ్రగ్స్, తుపాకులు పట్టుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏకంగా పాములు పట్టుబడటం భయాందోళన కలిగించాయి. ఇద్దరు మహిళలు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు విమానంలో బయలుదేరారు. అయితే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు విమానం రాగానే కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీలు నిర్వహించగా ఒక్కసారిగా షాక్ తిన్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళల వద్ద విషపూరిత పాములను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను అదుపులో తీసుకుని ఆరా తీస్తున్నారు. బ్యాంకాక్ నుంచి పాములు తీసుకుని వస్తున్న మహిళలను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేసిన ఎందుకు గుర్తించలేదు? అనే అనుమానం వ్యక్తం మవుతుంది. ఇద్దరు మహిళలతో పథకం ప్రకారమే విషపూరిత పాములతో ఇక్కడకు పంపారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే విషపూరిత పాములు ఎయిర్ పోర్టులో పట్టుబడటంతో ప్రయాణికులు భయాందోళన చెందారు.
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

Show comments