CM Revanth Reddy: హైదరాబాద్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి సహా పలువురు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. సీఎం రేవంత్‌రెడ్డికి దత్తాత్రేయ శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఈ సందర్భంగా అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఆర్కిటెక్ట్‌ను రేవంత్‌రెడ్డి, గవర్నర్‌లు శాలువాతో సత్కరించారు. కాగా, హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో బండారు దత్తాత్రేయ నేతృత్వంలో అలయ్ బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
Akhil- Niharika: అఖిల్- నిహారిక జోడీగా రాజమౌళి కొడుకు సినిమా.. కానీ?
