Rammohan Naidu: చంద్రబాబు నాయుడు ఆలోచనతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించబడిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ జీఎంఆర్ అరేనాలో 2nd ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ – 2024 కార్యక్రమంలో మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ పేరుతో ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 11 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ లో భాగంగా 10K రన్ ను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 10K రన్ లో అన్ని విభాగాల ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్టొన్నారు. ఏక్ పేడ్ మా కే నామ్ లో భాగంగా మంత్రి మొక్కను నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సెంట్రల్ మినిస్టర్ అయ్యాక హైదరాబాద్ లో తొలి ఈవెంట్ కు హాజరయ్యాను.. ఇది నాకు మర్చిపోని రోజన్నారు. 2014 కు ముందు తరువాత ఏవియేషన్ లో అనేక వచ్చాయన్నారు. చంద్రబాబు నాయుడు ఆలోచనతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించబడిందన్నారు.
Read also: Haritha Haram Programme: తెలంగాణ హరితహారంపై రాజ్యసభలో చర్చ.. కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు..
దేశంలో నాల్గవ అతిపెద్ద ఎయిర్ పోర్ట్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఉందన్నారు. ఎందుకు ఇంత పెద్ద ఎయిర్ పోర్ట్ అన్నారు.. వరల్డ్ లోనే టాప్ 10 ఎయిర్ పోర్ట్స్ సరసన నిలిచిందని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్ పోర్ట్స్ నిర్మాణానికి.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. అనేక సందర్భాల్లో తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఎయిర్ పోర్ట్ ల నిర్మించాలనే అంశం వచ్చిందన్నారు. తెలంగాణ ఇతర ఎయిర్ పోర్టుల నిర్మాణానికి మేము ప్రణాళికలు రెడీ చేస్తున్నాం.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. దేశంలో 2014 కు ముందు 60మిలియన్ల మంది విమానాల్లో ప్రయాణించారు.. గత పదేళ్ల నుంచి 160 మిలియన్ల ప్రయాణికులకు చేరారన్నారు. సివిల్ ఏవియేషన్ లో సెక్యూరిటీ అనేది కీలకం.. దాన్ని మరింతగా మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్రాలు కూడా సివిల్ ఎయిర్ పోర్ట్స్ కు సపోర్ట్ చేస్తున్నాయన్నారు. సివిల్ ఏవియేషన్ మంత్రిగా నిన్న పార్లమెంట్ లో ఏవియేషన్ కు సంబంధించిన బిల్ పాస్ చేసుకున్నామన్నారు. స్ట్రాంగెస్ట్ ఇండస్ట్రీగా తీర్చి దిద్దుతా.. దేశంలోనే నంబర్ వన్ మినిష్టర్ గా పని చేస్తా అన్నారు.
Rakhi Festival: ఆడపడుచులకు ఆర్టీసీ బంపరాఫర్.. రాఖీల రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లు..