Telangana Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం తెలంగాణపై కూడా అల్పపీడనం ప్రభావం చూపనుంది. దీంతో రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఇవాళ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో వాన కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి అక్కడక్కడా వర్షం కురుస్తుంది. మంగళవారం రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు ఆవరించి చల్లటి గాలులు వీచాయి. మరోవైపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. నల్గొండ జిల్లా మాథూరులో 1.1 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 1.1 సెం.మీ వర్షం కురిసింది.
Read also: Christmas Celebrations: తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు.. యేసు నామస్మరణతో మార్మోగిన చర్చిలు
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండటంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మళ్లీ బలపడుతుందా.. బలహీనపడుతుందా అన్నది తేలలేదు. ప్రస్తుతం తీరం సమీపంలో కదులుతుండడంతో మేఘాలు కమ్ముకుని చిరు జల్లులు కురుస్తున్నాయి. దీనికి తోడు చలి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Atal Bihari Vajpayee : అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మోడీ