NTV Telugu Site icon

Ponnam Prabhakar: ఏడాది పాలనపై హరీష్ రావు చార్జీషీట్.. పొన్నం ప్రభాకర్ కౌంటర్..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన చార్జీషీట్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జిషీట్ కాదు రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదని తెలిపారు. వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చార్జిషీట్.. పార్టీలు మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ గా భావించి వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కానీ దురదృష్టకరం ఏమిటంటే సంవత్సర కాలం పరిపాలన తరువాత ఇవాళ మమ్మల్ని విమర్శించిన చార్జిషీట్ ఫైల్ చేసిన బాగుంటుండే అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ సంవత్సరం కాగానే చార్జిషీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదన్నారు.

Read also: Darragh Storm : కరెంటు కట్, కూలిన వందలాది చెట్లు, రవాణా బంద్… ఉత్తర ఐర్లాండ్ ను వణికిస్తోన్న డార్రాగ్ తుఫాను

ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అన్నారని తెలిపారు. పిల్లి శాపనార్థాలు పెట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని కూల గొడతామన్నారని మండిపడ్డారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన చార్జిషీట్ అంశాలు ప్రజా సంబంధించిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. అది చార్జిషీట్ కాదు రిప్రజంటేషన్.. ప్రతిపక్షాలు అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
Elonmusk : ఎలాన్ మస్క్ చేతిలో అమెరికా.. అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడుతుంది ?