Site icon NTV Telugu

Medha Patkar: హైదరాబాద్‌లో మేధాపాట్కర్ ప్రత్యక్షం.. పోలీసులు అలర్ట్

Medhapatkar

Medhapatkar

ప్రముఖ సామాజిక కార్యకర్ద మేధా పాట్కర్ హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. ఛాదర్‌ఘాట్‌ సమీపంలోని ఓ ఇంటికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మేధా పాట్కర్ ఉన్న ఇంటికి చేరుకున్నారు. మూసీ సుందరీకరణ పనులను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో మేధా పాట్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను స్నేహితుల ఇంటికి మాత్రమే వచ్చినట్లు ఆమె చెప్పారు. అయినా కూడా ఆమె మాటలను పోలీసులు వినలేదు. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని మేధా పాట్కర్‌కు పోలీసులు సూచించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: AP Assembly Budget Sessions: మెగా డీఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్‌

తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ పనులను చేపట్టింది. అయిత విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మేధా పాట్కర్ కూడా ఇదే ఉద్దేశంతో వచ్చి ఉంటారని పోలీసులు అనుమానించారు. దీంతో ఆమె ఇచ్చిన ఇంటికి భారీగా పోలీసులు తరలివచ్చారు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Prashanth Reddy: ఎస్‌ఎల్‌బీసీని మంత్రులు వినోద యాత్రగా మార్చుకున్నారు

Exit mobile version