Telangana: నేడు తెలంగాణ వైతాళికుడు, ప్రజల పక్షంవహించిన ప్రజాకవి, రచయిత, ఉద్యమకారుడు, పద్మవిభూషణ్, కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాళోజీ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఆయన జయంతిని నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. అన్యాయానికి ఎదురొడ్డి నిత్య చైతన్య శీలి. జీవితమే గమనం, ఉద్యమమే శ్వాసగా జీవించిన మహానుభావుడు. అందుకే ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9న కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది.
Read also: Heavy Rains: భారీ వర్షాలు.. విలీన మండలాలు అతలాకుతలం..
ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు ‘అన్యాయానికి దిశానిర్దేశం చేసేవాడు’. కాళోజీ 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. అతని తల్లి రమాబాయమ్మ కన్నడిగు మహిళ. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. మాడపాటి, సురవరం, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావులతో పాటు అనేక ఉద్యమాల్లో కాళోజీ పాల్గొన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ఉల్లంఘించి వరంగల్ లో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాప్తి చేయాలనే ఆకాంక్షతో ఆంధ్ర సారస్వత పరిషత్‌ను స్థాపించిన వారిలో కాళోజీ ప్రముఖులు. అభ్యర్ధి ఏపార్టీ వార్టీ వాడని కాదు.. ఏపాటి వాడో చూడు..ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు..పెట్టుకునే టోపీ కాదు.. పెట్టిన టోపీ చూడు.. ఎన్నికల్లో మంచి అభ్యర్ధిని ఎన్నుకోవడం ఎంత ముఖ్యమో.. కాళోజీ తెలియచేశారు. తూటాల్లాంటి మాటలతో గుండెల్లో గుచ్చుకునే కాళోజీ కవితల గురించి.. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. కాళోజీ ఒక కళాశాల.. వాడుక భాషలోని మాధుర్యాన్ని చాటిచెప్పి అవినీతిని అక్షరాలతో బద్దలు కొట్టిన మహానుభావుడు మన కాళోజీ. అందుకే కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. దీంతో..కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Instagram: ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయం.. 20 రోజులు బంధించి యువతిపై లైంగిక దాడి..