MP Sudha Murty: క్రియేటివ్ గా ఆలోచించండి.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి అన్నారు. నేను తెలుగు అర్దం చేసుకోగలను… కానీ మాట్లాడలేనని తెలిపారు. ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు పురుషులతో పోలిస్తే స్మార్ట్ అన్నారు. ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది.. మహిళలు దేనికైనా అడ్జెస్ట్ అవ్వగలరని తెలిపారు. ఒక్కొక్క బంధంలో అడ్జెస్ట్ అవ్వగలదు.. అవసరమైతే కంట్రోల్ చెయ్యగలదన్నారు. భారత దేశంలో అనేకమంది మహిళా ఉపాధ్యాయురాళ్ళు ఉన్నారని తెలిపారు. జీవితంలో అనేక సమస్యలు చూసాను.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలన్నారు. స్థిత ప్రజ్ఞత ఉండాలి… విద్యకు లింగ విభేదం లేదు.. విద్యా అందరి హక్కు.. అన్నారు. ఎక్కడ ఉంటే అక్కడే ప్యాలస్ లాగా మార్చుకోవాలన్నారు. అధైర్య పడకు..
రియాలిటీ లో ఉండాలి.. అని తెలిపారు. కలలు కనండి.. కానీ రియాలిటీ లో ఉండి ఆలోచించండి అన్నారు. క్రియేటివ్ గా ఆలోచించండి.. ఎప్పుడు నాలెడ్జ్ నీ సంపాదించండి అన్నారు. అన్ని పుస్తకాల్లో ఉండవు… సమాజాన్ని కూడా బోధించాలన్నారు. విద్యార్థుల స్ఫూర్తిని నింపేవిధంగా మన బోధన ఉండాలన్నారు. కష్టాలు..సుఖాలు వస్తాయి… కానీ ఏదీ పేర్మినెంట్ కాదు… అది ఎప్పటికీ మర్చిపోవద్దన్నారు.
Ponnam Prabhakar: మల్లన్న సాగర్ కు వచ్చింది ఎల్లంపల్లి నీళ్లా.. కాళేశ్వరం నీళ్ళా..? హరీష్ కు పొన్నం ప్రశ్న..
MP Sudha Murty: క్రియేటివ్ గా ఆలోచించండి.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి..
- కష్టాలు సుఖాలు వస్తాయి- కానీ ఏదీ పేర్మినెంట్ కాదు..
- అది ఎప్పటికీ మర్చిపోవద్దు..

Mp Sudha Murty