NTV Telugu Site icon

Kishan Reddy: హైదరబాద్‌ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్‌ సర్వీసులు..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ను స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో నిర్మాణం చేశామన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి తెలంగాణకు రైల్వేల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. నూతన రైల్వే లైన్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఇప్పటికే హైదారాబాద్ లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగుడతోపాటు అదనంగా చర్లపల్లిని నాలుగో నూతన రైల్వే స్టేషన్ గా రాబోతుందని తెలిపారు. దీనికారంగా హైదారాబాద్ లో ట్రాఫిక్ తగ్గుతుందని తెలిపారు.

Read also: CM Revanth Reddy: హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాం..

ప్రధాని నేతృత్వంలో ఈ రైల్వే స్టేషన్ ను తక్కువ సమయంలో నిర్మించామని తెలిపారు. ఇప్పటికే 98 శాతం పూర్తి అయ్యిందని తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ను 430 కోట్ల రూపాయాలు ఖర్చు చేసి నిర్మించామన్నారు. రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు కొత్త టెక్నాలజీతో అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. దివ్యాంగులకు, వృద్దులకు మెట్లు ఎక్కడానికి ఎస్కలెటర్లు, లిఫ్ట్ లు ఏర్పాటు చేశామన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. భరత్ నగర్, మహాలక్ష్మీ నగర్ వైపున 80 అడుగుల మేర రోడ్లు కావాలని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం మాష్టర్ ప్లాన్ తయారు చేసిందని, వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయిలో ఇక్కడనుండి రోడ్లు కనెక్టివిటీ ఉంటేనే ఉపయోగం ఉంటుందన్నారు.

Read also: KA Paul: నన్ను చంపితే స్వర్గానికి పోతా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రైల్వే ప్రమాదాలు జగకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్రమోడీ రైల్వే కవచ్ వ్యవస్థను తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని తెలిపారు. ఇందుకోసం ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వందేభారత్ రైళ్లు డిల్లీ తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. త్వరలో వందే భారత్ ట్రెయిన్ లలో స్లీపర్ కోచ్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో అమృత్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను, 429 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ను, 430 కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 521 కోట్లతో రైల్ మ్యానుఫాక్చర్ యూనిట్ ను ప్రారంభించామన్నారు. 346 కిలోమీటరు మేరకు తెలంగాణలో రైల్వే లైన్లు నిర్ణయించామన్నారు. 369 కిలోమీటర్ల మేర సింగిల్, డబుల్ లైన్లను నిర్ణయించామన్నారు. త్వరలోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
Ap-Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..