NTV Telugu Site icon

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..

Kavitha

Kavitha

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కవితను అధికారులు వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కవితకు చికిత్స అందిస్తున్నారు. కవిత గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆమెకు వైద్యం అందిస్తున్నామని అన్నారు. ఎటువంటి ప్రమాదం లేదని జైలు అధికారులు తెలిపారు. కాగా.. ఇటీవల కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర జ్వరం ,నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీలాండరిగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు. కవితపై సీబీఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి.

Read also: T. Harish Rao: రైతు రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి..

మరోవైపు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత బెయిల్‌పై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసినా.. ఈడీ చేయలేదు. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం ఇవ్వాలని వారు ధర్మాసనాన్ని కోరగా, ఈడీ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. శుక్రవారం లోపు కవిత తరఫున న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వచ్చే మంగళవారానికి ఆగస్ట్ 27 కు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసి, మార్చి 16న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
Radha Family: రాధను చంపింది పోలీసులా? మావోయిస్టులా?.. మాకు తెలియాలి..