NTV Telugu Site icon

Ponnam Prabahakar: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabahakar: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. విజయోత్సవ చివరి రోజైన డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల కీలక నేతలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు.

Read also: Yadadri Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు స్పాట్ డెడ్..

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా పొన్నం ప్రభాకర్ ఆహ్వానించనున్నారు. అయితే వారిద్దరిని ఎప్పుడు వెళ్లి ఆహ్వానిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సీఎం ఆదేశాలు మేరకు మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను పొన్నం ప్రభాకర్ ఆహ్వానించనున్నారు. అయితే మంత్రి పొన్నం ఆహ్వానంతో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్ వస్తారా? రారా? అనేది సోమవారం(9వతేదీ) వరకు వేచి చూడాల్సిందే.
Patnam Narender Reddy: పోలీసు కస్టడీకి పట్నం నరేందర్‌రెడ్డి..