NTV Telugu Site icon

Komati Reddy Counter: కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటి రెడ్డి గట్టి కౌంటర్

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komati Reddy Counter: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటి రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అమృత్ టెండర్లు అర్హత లేని వాళ్లకు ఇచ్చింది కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని రద్దు చేయాలని చెప్పిందే నేను అన్నారు. మేము టెండర్ పిలవడం వల్ల 65 కోట్లు ప్రభుత్వానికి మిగిలాయన్నారు. కేటీఆర్ నీ డిల్లీలో ఎవరు డెక్తరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డిల్లీకి వెళ్ళింది గవర్నర్ విచారణ నుండి బయట పడేందుకు అని తెలిపారు. ఈ రేసింగ్ లో.. కంపనీ కి పాండ్స్ లోకి మార్చి నిధులు మళ్లించారని తెలిపారు. అది చాలా పెద్ద నేరం అని తెలిపారు.
దాంట్లో ఎక్కడ జైల్ కి వెళ్తానో అనే భయం పట్టుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అమృత్ స్కీమ్ లో ఆయన.. ఇచ్చిన కంపనీ ఎవరిది..? అని ప్రశ్నించారు. ప్రతిమా.. గజా కంపెనీలు కేసీఆర్ సన్నిహితులవే కదా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్.. తన అవినీతి బయటకు వచ్చింది..జైల్ కి పోవాల్సి వస్తుందని.. ఇష్యూ డైవర్ట్ చేస్తున్నాడని తెలిపారు. కలక్టర్ మీద దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్త అని సంచలన వ్యఖ్యలు చేశారు. కలక్టర్ మీద దాడి చేయించి ఇష్యూ డైవర్ట్ చేసే పనిలో ఉందన్నారు.

Phone Tapping: కేసులో కీలక పరిణామం.. నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..

Show comments