Site icon NTV Telugu

Krmb-Grmb Meeting: ఈనెల 13,14 జీఆర్‌ఎంబీ, కేఆర్ఎంబీ సమావేశం..

Krmb

Krmb

Krmb-Grmb Meeting: చెన్నయ్‌ నగరానికి తాగునీటిని అందించడంపై చర్చ ఈనెల 14వ తేదీన ఉదయం 11 గంటకు ఆన్‌లైన్‌ విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో కృష్ణా నదీయాజమాన్య సంస్థ సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందిజేసిన కేఆర్‌ఎంబీ మెంబర్‌ సెక్రటరీ రాయ్‌పురే సాచారాన్ని తెలుగు రాష్ట్రాక పంపారు. మరోవైపు గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం ఈ నెల 13న జరగనుంది. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతారామ బహుళార్థసాధక ప్రాజెక్టు పథకాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సమర్పించనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న జీఆర్‌ఎంబీ భేటీకి హాజరుకావాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు జీఆర్‌ఎంబీ సమాచారం పంపింది. ఈనెల 6న జరగాల్సిన ఈ సమావేశాన్ని తెలంగాణ అభ్యర్థన మేరకు గోదావరి బోర్డు ఈనెల 13కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Read also: Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

మరోవైపు గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలపై చర్చించేందుకు జాతీయ జలాభివృద్ధి సంస్థ ఈ నెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో అథారిటీ చైర్మన్‌ భూపాల్‌సింగ్‌ నేతృత్వంలో సమావేశం కొనసాగనుంది. ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు తెలంగాణ అధికారులకు సమాచారం అందించారు. జిసి రివర్ లింక్ ప్రాజెక్టును ఎక్కడ చేపట్టాలనే అంశంపై చాలా కాలంగా చర్చ సాగుతోంది. ముందుగా సమ్మక్కసాగర్ నుంచి, తర్వాత ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేందుకు ప్రతిపాదనలు చేశారు. NWDA బోర్డు సమావేశంలో, ఇంద్రావతి నుండి కూడా కొత్త తరలింపు ప్రతిపాదించబడింది. ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో 9న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం నిర్వహించి సందేహాలను నివృత్తి చేయాలని నిర్ణయించింది.
KGF : త్వరలోనే సెట్స్ పైకి KGF -3.. హీరో ఎవరంటే..?

Exit mobile version