Koti Deepotsavam 2026: హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వైభవంగా సాగుతోంది.. కోటి దీపోత్సవం 2026లో భాగంగా ఐదో రోజు నవంబర్ 18వ తేదీ బుధవారం ప్రత్యేక ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్తీక శుద్ధ నవమి సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ, శ్రీ అసంగానందగిరి స్వామీజీ (వేదపీఠ శ్రీవ్యాసాశ్రమం) అనుగ్రహ భాషణం చేయనున్నారు. అలాగే ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి ప్రవచనామృతం అందించనున్నారు.
కార్యక్రమాల్లో భాగంగా వేదికపై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రేజింటల్ మహోగణపతికి కోటిగరికార్చన, భక్తులచే గణపతి విగ్రహాలకు కోటిగరికార్చన నిర్వహించనున్నారు. అదేవిధంగా కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతి కల్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చివరిగా భక్తుల కోసం ముషిక వాహనం కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం..
నేటి కోటి దీపోత్సవం ప్రత్యేక షెడ్యూల్
అనుగ్రహ భాషణం: శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ (వేర్పేడు శ్రీవ్యాసాశ్రమం), శ్రీ అసంగానందగిరి స్వామీజీ (వేర్పేడు శ్రీవ్యాసాశ్రమం)
ప్రవచనామృతం: ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులకు అందించనున్నారు.
వేదికపై పూజ: రెజింటల్ మహోగణపతికి కోటిగరికార్చన నిర్వహించనున్నారు.
భక్తులచే పూజ: గణపతి విగ్రహాలకు కోటిగరికార్చన కార్యక్రమం జరగనుంది.
కల్యాణం: కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతి కల్యాణం నిర్వహించనున్నారు.
వాహన సేవ: మూషిక వాహనంపై స్వామివారి సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
కార్తీక మాస పవిత్రతను చాటిచెప్పే ఈ కోటి దీపోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని.. స్వయంగా పూజా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆహ్వానం పలుకుతున్నారు..

