Site icon NTV Telugu

Kondapur Demolitions: హైకోర్టు తీర్పుతోనే కొండాపూర్‌లో కూల్చివేతలు.. హైడ్రా సంచలన వ్యాఖ్యలు

Hydra

Hydra

Kondapur Demolitions: హైదరాబాద్ నగరంలోని కొండపూర్ లో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. దాదాపు 3600 కోట్ల రూపాయల విలవ చేసే 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. అయితే, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలోని సర్వే నంబర్ 59లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంత మంది కబ్జా చేశారని హైడ్రా తెలిపింది. దీనిపై గతంలో రైతులకు అనుకూలంగా రంగారెడ్డి జిల్లా సివిల్ కోర్టు తీర్పు ఇచ్చింది.

Read Also: Indian movies : కెనడా‌లో భారతీయ సినిమాల థియేటర్ స్క్రీనింగ్ నిలిపివేత

అయితే, రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. దీంతో ఉన్నత న్యాయస్థానం సర్కార్ రేవంత్ సర్కార్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ 36 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు మేరకు ఇవాళ ( అక్టోబర్ 4న) ఉదయం నుంచి కొండాపూర్ లోని బిక్షపతి నగర్ ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణల తొలగింపును భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది చేపట్టింది. తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించింది.

Exit mobile version