NTV Telugu Site icon

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేషుడి వద్దకు భారీగా భక్తులు.. ట్రాఫిక్ మళ్లింపు.. మూడు షిఫ్టుల్లో పోలీసుల డ్యూటీ..

Ganesh Khairatabad

Ganesh Khairatabad

Khairatabad Ganesh: తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు జరుపుకుంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేష్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఖైరతాబాద్ వేడుకలు 70 ఏళ్లు పూర్తవుతుండడంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు పద్మశాలి సంఘం తరపున బడా గణేష్ కు జంజం, కండువా సమర్పించారు. అలాగే ఈసారి ఖైరతాబాద్ లో గణేష్ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో శని, ఆదివారాల్లో రెండు సార్లు వస్తున్నందున పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్లు పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు 24 గంటల పాటు 3 షిప్టుల్లో విధులు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

Read also: Khairatabad Ganesh: నేడు ఖైరతాబాద్‌ వినాయకుడిని రేవంత్ రెడ్డి దర్శనం.. భారీ బందోబస్తు..

భారీ గణపతి వద్ద బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్పీలు, 13 మంది ఇన్ స్పెక్టర్లు, 33 మంది ఎస్ ఐలు, 22 ప్లటూన్ల సిబ్బంది పని చేస్తారని సైఫాబాద్ ఏసీపీ ఆర్.సంజయ్ కుమార్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గణపతి దర్శనానికి వచ్చే భక్తులు సొంత వాహనాలను తీసుకురావద్దన్నారు. రైల్వే గేటు నుంచి నడిచే వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఈ మార్గంలో వాహనాలకు అనుమతి లేదు. ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ మీదుగా వచ్చే వారు ఐమాక్స్‌ పక్కనే పార్కింగ్‌ స్థలంలో వాహనాలను పార్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే మింట్ కాంపౌండ్ వైపు వచ్చే భక్తులు తమ వాహనాలను కార్ రేసింగ్ ఏరియాలో పార్క్ చేసి కాలినడకన దర్శనానికి రావాలి. సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. రోడ్లపై వాహనాలు నిలిపివేస్తే సీజ్ చేస్తామని, గణపతికి మూడు వైపులా 500 మీటర్ల వరకు నో వెండింగ్ జోన్ ఉందని, చిరు వ్యాపారాలకు అనుమతి లేదని తెలిపారు.
Khammam: నేటి నుంచి ఖమ్మంలో రూ.10వేల సాయం.. మూడు రోజుల్లో ప్రక్రియ ముగించనున్న సర్కార్..