NTV Telugu Site icon

G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..

G. Kishanreddy

G. Kishanreddy

G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బేగంపేటలోని వివంతా హోటల్ లో జరిగిన మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. 2027 లోపే భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోందన్నారు. 70 ఏళ్లు దాటిన ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నామని తెలిపారు. 2047 వరకు దేశ అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. దేశం ఆత్మ నిర్బర భారత్ ఎదగాలంటే మైనింగ్స్ అండ్ మినరల్స్ భాగస్వామ్యం ఉండాలన్నారు. మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలన్నారు. ప్రపంచానికి జింక్ ను అందించింది భారత దేశం అని తెలిపారు. ఇంకా మినిరల్స్ పై ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నామని తెలిపారు. కోల్ అంశంలో ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు.

Read also: December clash: డిసెంబర్ దంగల్..రేసులో ఉండేది ఎవరు తప్పుకునేది ఎవరు..?

దేశానికి కావాల్సినంత కోల్ ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగామన్నారు. మినరల్ విషయంలో మనం స్వయం సమృద్ధిగా ఎదగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మినరల్ అన్వేషణ కోసం సహకారం అందించేందుకు ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. మినరల్ అన్వేషణ కోసం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. గనుల Exploration కు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన సమయం సందర్భం అని అన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో గనుల తవ్వకం లో నూతన ఆవిష్కరణలతో పాటు మైనింగ్ సంబంధిత వర్గాల సంక్షేమం విషయంలో మా ప్రభుత్వం నూతన ఆవిష్కరణలతో వైవిధ్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వారి చొరవ తో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు.. స్వయం సమృద్ధి ని పెంచడమే మా ప్రభుత్వం లక్ష్యమన్నారు.

Read also: CM Revanth Reddy: పరీక్షలు పెట్టకుండా… వాయిదా వేస్తూపోతే వయసైపోతుంది..

పారదర్శకతతో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల సంక్షేమం, క్లీన్ ఎనర్జీని పెంపొందించడం మా ఉద్దేశమన్నారు. భారత దేశాన్ని ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ను రూపొందించడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం అని తెలిపారు. ఈ సాధనలో మైనింగ్ సెక్టార్ ముఖ్యమైన పాత్ర పోషించునుంది మైనింగ్ సెక్టార్ భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. బలమైన మైనింగ్, మినరల్స్ సెక్టార్ లేకుండా స్వయం సమృద్ధి సాధ్యం కాదని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఈ రెండూ మన ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలని తెలిపారు. మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో పాటే మినరల్స్ కు డిమాండ్ పెరుగుతున్నదని, అందుకే ఆధునిక టెక్నాలజీతో ఖనిజ సంపదను అన్వేషించాల్సిన సమయం ఇదే అన్నారు. దీని కోసం GSI ద్వారా ఎక్స్ టెన్సివ్ జియోలాజికల్ డేటా ను రూపొందించామన్నారు.

Read also: Dog Breeding: ఇంట్లో కుక్కలను పెంచుకోవడమే కాదు.. ఇవి కూడా చేయాలి..

ఎక్స్ ప్లోరేషన్ ను పెంచడానికి నేషనల్ మినరల్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. మినరల్ ఎక్స్ ప్లోరేషన్ కోసం ప్రైవేట్ కంపెనీలను కూడా నోటిఫై చేశామని వెల్లడించారు. GSI ద్వారా నేషనల్ జియో సైన్స్ డేటా డిపాజిటరీపై బేస్ లైన్ జియో సైన్ డేటాను అందుబాటులోకి తెచ్చామన్నారు. భవిష్యత్తులో సీస్మిక్ రిఫ్లెక్షన్స్, ఎలెక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ప్రయోగం ద్వారా ఇంకా అడ్వాన్స్డ్ డేటా అందుబాటులోకి తెస్తామని అన్నారు. మినరల్ ఎక్స్ ప్లోరేషన్ లో GSI కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ రోజు హ్యాకథాన్ ఫై ఇన్నోవేటివ్ మినరల్ హంట్ టెక్నిక్ ను ప్రారంభించుకోవడం కోసం మనం ఇక్కడ సమావేశమయ్యమని తెలిపారు. 2015 కు ముందు మైనింగ్ సెక్టార్లో అనేక సవాళ్లు ఉండేవి. బ్లాక్స్ కేటాయింపు పై అనేక కోర్టు కేసులు నడిచేవి. రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన భాగస్వామ్యం లభించేది కాదు. తగిన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల గ్రాంట్, రెన్యువల్స్ ఆగిపోయేవన్నారు.

Read also: Secunderabad Bonalu: రేపే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్ష‌లు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 2015లో MMDR చట్టంలో పలు సవరణలు తెచ్చిన తర్వాతే మైనింగ్ సెక్టార్లో సంస్కరణలు మొదలయ్యాయి. ఆ సంస్కరణల లాభం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. ఇప్పటి వరకు 373కి పైగా మైనింగ్ బ్లాక్స్ వేలం పూర్తయింది. అయితే ఈ ప్రయాణంలో 2023లో 24 క్రిటికల్ అంద్ స్ట్రాటజికల్ బ్లాక్స్ ను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ రోజు క్రిటికల్ మినరల్ కు సంబంధించి రెండవ, మూడవ ట్రాంచ్ కు చెందిన బిడ్డర్స్ ను ప్రకటించడం నాకు సంతోషంగా ఉందన్నారు. వారికి నా అభినందనలు. బిడ్డర్లు త్వరగా ఉత్పత్తి మొదలు పెట్టలని కోరుకుంటున్నాను. ఇదే ఉత్సాహంతో 4వ ట్రాంచ్ బిడ్ కోసం నేటి రోడ్ షో చాలా కీలకం అన్నారు. భారత ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి స్టేక్ హోల్డర్స్ కు ఇది ఒక గొప్ప అవకాశమని తెలిపారు.

Read also: Gopanpally Flyover: నేడు గోపల్‌పల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం.. తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు..

అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ ఈ 6 రాష్ట్రాల్లో వేలం వేయడానికి 10 కొత్త క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్ ను గనుల శాఖ ఎంపిక చేసిందన్నారు. మినరల్ ప్రభావిత వర్గాల సంక్షేమం కోసం  కేంద్ర ప్రభుత్వం 2015లో 23 రాష్ట్రాల్లోని 645 జిల్లాల్లొ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ లు ఏర్పాటు చేసిందని, మినరల్ రంగంలో ఇదో కీలక పరిణామం అన్నారు. మైనింగ్ ప్రభావిత వర్గాల సంక్షేమం విద్య, వైద్యం, స్కిల్ డెవలప్ మెంట్,వారి జీవనోపాధికి ఈ ఫండ్ కీలకంగా ఉందని తెలిపారు. ఈ సందర్బంగా నేషనల్ DMF పొర్టల్ ను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉందన్నారు. ఖనిజ క్షేత్రంలో స్వయం సమృద్ధి సాధించడానికి మా ప్రభుత్వం కృత నిశ్చ్యమతో ఉంది మనమంతా సంఘటితంగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. మనందరం కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం ఆత్మ నిర్భర్ భారత్ కలను నిజం చేయడానికి కృషి చేద్దామని పిల్పునిచ్చారు.
Mallu Bhatti Vikramarka: ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విందు..

Show comments