Jagga Reddy: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన ఏదైనా మాట్లాడితే వివాదం అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో సరైన గుర్తింపు రావడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ బోనాల పండుగ సందర్భంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాలను వీక్షించేందుకు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని రామమందిరం నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ప్రస్తుతం ఎమ్మెల్యేను కానని.. కానీ సోనియా, రాహుల్ ఆశీస్సులతో.. వచ్చే పదేళ్లలో సీఎం అవుతానని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
Read also: Jewelry Shop Robbery: సినిమాను తలపించేలా.. ముంబైలో ముసుగులు ధరించి నగల షాపులో చోరీ.. (వీడియో)
జగ్గారెడ్డి దుర్గమ్మ ఆలయం వద్దకు రాగేనే అక్కడున్న వారందరూ సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో జగ్గారెడ్డి మాట్లాడుతూ వచ్చే పదేళ్లలో ఖచ్చితంగా అవుతానని చెప్పడి సర్వత్రా ఆశక్తికరంగా మారింది. జాగ్గారెడ్డి సీఎం అవుతాను అని చెప్పడం కొత్తేమీ కాదు. తాజాగా ఓ ఇంటర్వూలో కూడా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నేను అధిష్టాను అనుగ్రహిస్తే తెలంగాణ సీఎం అవుతానని చెప్పడం అప్పట్లో ఈ మాటలు తీవ్ర దుమారం రేపింది. అయితే 9ఏండ్లు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన కొనసాగింది. ఇక కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. ఇప్పుడు రేవంత్ తెలంగాణ సీఎంగా వున్నారు. కాంగ్రెస్ తెలంగాణలో పరిపాల కొనసాగుతున్న కూడా జగ్గారెడ్డి పదేళ్లలో సీఎం అవుతానని చెప్పడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే దుమారం రేపుతుంది. జగ్గారెడ్డి మాటలకు బీజేపీ, బీఆర్ఎస్ స్పందించకపోగా.. కాంగ్రెస్ నాయకుల్లోకూడా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Gold Rate Today: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?