NTV Telugu Site icon

IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మాణం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు..

Sridhar Babu

Sridhar Babu

IT Minister Sridhar Babu: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ పరుగులు పెడుతుందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. మానవ జీవన విధానం కొత్త దిశగా మార్చనున్న AI అని తెలిపారు. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ చాలా వేగం గా ముందుకు వెళుతుందన్నారు. ఇప్పటికే AI ప్రభావం ఏంటో మనం అంతా చూస్తున్నామని తెలిపారు. తెలంగాణ లో AI రీసెర్చ్ కోసం పెద్ద పెద్ద యూనివర్సిటీలు, విద్య సంస్థల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. డీప్ ఫేక్ లాంటివి AI మాయాజాలం. AI ను ఎథికల్ బెనిఫిట్ కోసం వినియోగించాలన్నారు. హైదరాబాద్ కి దగ్గరలో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మించ బోతున్నం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు అన్నారు. ట్రిలియన్ డాలర్ ఎకానమీ గా తెలంగాణ పరుగులు పెడుతుందన్నారు. AI గ్రోత్ లో ఇది కేవలం ఆరంభం మాత్రమే. AI సిటీ నీ ఫ్యూచర్ లో మరింత గా విస్తరిస్తామని తెలిపారు.

Read also: CM Revanth Reddy: ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత..

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండురోజులు (05,06 తేదీల్లో) ఈ సదస్సు జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ సదస్సును ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఇక గ్లోబల్ సమ్మిట్ లో AI రోడ్ మ్యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన AI రోడ్ మ్యాప్ లో 25 కార్యక్రమాలను ప్రభుత్వం పొందుపరిచింది. ప్రపంచం నలుమూలల నుండి 2,000 మంది వ్యక్తులు, కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ తరహా ఏఐ సదస్సు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతోంది. సమాజంపై AI ప్రభావాన్ని నియంత్రించడం, సవాళ్లను సదస్సులో చర్చించనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు AI గ్లోబల్ సమ్మిట్ కొనసాగనుంది.
Khairatabad Ganesh: నేడు ఖైరతాబాద్ మహాగణపతికి నేత్రాలంకరణ..