NTV Telugu Site icon

Hyderabad CP Anand: ట్యాంక్ బండ్ పై నిమజ్జనం లేదు… హైదరాబాద్ సీపీ ప్రకటన..

Hyderabad Cp Anand

Hyderabad Cp Anand

Hyderabad CP Anand: గణేష్ నిమర్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ సిటీ పరిధిలో 15 వేలు, ఇతర జిల్లాల నుంచి మరో 3 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు. హై కోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జం లేదని స్పష్టం చేశారు.

Read also: Danam Nagender: బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశానికి గాంధీ ఇళ్లే దొరికిందా..?

ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు లో నిమర్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరో 8 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారని తెలిపారు. ఇదే సమయంలో మిలాద్ ఉన్ నబీ ప్రోగ్రామ్ ఉంది మత పెద్దలతో సమన్వయం చేస్తున్నామన్నారు. 17న పబ్లిక్ గార్డెన్ లో ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమం, పెరేడ్ గ్రౌండ్లో మరో కార్యక్రమం ఉందని సీపీ ప్రకటించారు. నిమజ్జనకు వచ్చే భక్తులు పోలీసులకు సహరించి, నిబంధనలు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు.

Read also: Harish Rao: భుజం నొప్పిగా ఉంది దవాఖానకు వెళ్లాలి.. హరీష్ రావుతో పాటు ఆసుపత్రికి పోలీసులు

నిబంధనలు ఇవే..

* గణేష్ విగ్రహానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తారు.

* విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్‌స్పీకర్‌ను అమర్చకూడదు.

* నిమజ్జనం రోజు వాహనాలపై DJతో కూడిన మ్యూజికల్ సిస్టమ్‌ను అనుమతించరు.

* రంగులు పిచికారీ చేయడానికి కాన్ఫెట్టీ గన్‌లను ఉపయోగించకూడదు.

* మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు లేదా మరేదైనా మత్తు పదార్థాలను కలిగి ఉన్న వ్యక్తులను విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనంలోకి అనుమతించరు.

*  రహదారిపై వెళ్లేటప్పుడు వాహనం ట్రాఫిక్‌ను ప్రభావితం చేయకూడదు

*  ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దు

Read also: School Holidays: విద్యార్థులకు పండగే.. ఈనెల 14 నుంచి 17 వరకు స్కూల్స్‌ కి సెలవులు

* విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనం ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా ఇతర వాహనాలకు లేదా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే రహదారిపై ఆగకూడదు.

* అప్పటి పరిస్థితిని బట్టి పోలీసు అధికారులు ఇచ్చే ఆదేశాలపై వాహనాల రాకపోకలు ఆధారపడి ఉంటాయి.

* ఊరేగింపులో ఎవరూ కర్రలు/కత్తులు, మారణాయుధాలు, మండే పదార్థాలు లేదా ఇతర ఆయుధాలను తీసుకెళ్లకూడదు.

* జెండాలు లేదా అలంకరణల కోసం ఉపయోగించే కర్రలు 2 అడుగుల పొడవు మించకూడదు.

* బాటసారులపై వెర్మిలియన్, కుంకుమ లేదా గులాల్ వేయవద్దు

* ఊరేగింపులో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు/ రెచ్చగొట్టే ప్రసంగాలు/ నినాదాలు లేదా రెచ్చగొట్టే సంకేతాలు లేదా బ్యానర్లు ఉపయోగించరాదు.

Read also: Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ నెల 17,18న వైన్స్ బంద్..

* ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఇతర రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు.

* ఊరేగింపు సమయంలో బాణసంచా కాల్చరాదు.

* పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలను పాటించండి.

* ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, 100కి డయల్ చేసి తెలియజేయండి.


Talasani Srinivas Yadav: ఆస్పత్రికి వెళ్లాలంటే హౌస్ అరెస్ట్ అంటారే..? పోలీసులపై తలసాని ఫైర్..