Site icon NTV Telugu

High Court Notices to Telangana Govt: జీహెచ్ఎంసీ చట్ట సవరణ.. సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

Telangana High Court

Telangana High Court

High Court Notices to Telangana Govt: జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) చట్ట సవరణకు సంబంధించిన వివాదంలో తెలంగాణ హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పలు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీన చేయడానికి జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టి హైకోర్టు.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పిటీషన్‌లో ప్రధానంగా తుక్కుగూడ మున్సిపాలిటీని జీ‌హెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పిటీషనర్‌ అభిప్రాయాలు తీసుకోకుండా మరుసటి చర్యలు తీసుకున్నారన్నది ప్రధాన వాదన. దీనిపై ప్రభుత్వం తరఫున కౌంటర్‌ను దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.

Read Also: Child Trafficking : పసికందుల దందాలో పేరున్న హాస్పిటల్స్.. షాకింగ్ రిపోర్ట్.!

Exit mobile version