Ex MLA Shakeel Son: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ విచారణకు హాజరుకున్నారు. నేడు పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే అని ఇటీవలే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సాహెల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. గత ఏడాది డిసెంబర్ 23న ప్రజా భవన్ గేట్స్ ను రాష్ డ్రైవింగ్‌తో ఢీ కొట్టాడని సాహిల్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. కేసు ఫైల్ అయినా తర్వాత సాహెల్ దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న సాహెల్ హైదరాబాద్ రావాల్సిందేనని.. పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Telangana Cabinet Meeting: నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం.. అసెంబ్లీ కమిటీహాల్‌లో భేటీ..
అయితే, ప్రజాభవన్ గేట్లను ఢీకొన్న కారు కేసులో సాహెల్ ను తప్పించి డ్రైవర్ అసిఫ్ ను నిందితుడిగా చేర్చేందుకు పంజాగుట్ట సీఐ దుర్గారావు చేసిన ప్రయత్నం బయటకు రావడంతో.. ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు. ఇందులో బోధన్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్, అబ్ధులా వాహేద్ ను కూడా నిందితులుగా చేర్చడంతో.. మొత్తం ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాహెల్ దుబాయ్ పారిపోయేందుకు డ్రైవర్ అసిఫ్ సహకరించగా.. అర్షద్, సోహెల్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్, సాహెల్ కోసం పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు.
Hyderabad Weather: వణికిస్తున్న చలి.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..