NTV Telugu Site icon

Fancy Number Hyderabad: భారీ మొత్తానికి ఫ్యాన్సీ నెంబర్లు.. వాహన యజమానుల్లో పెరుగుతున్న క్రేజ్‌

Fancy Number Hyderabad

Fancy Number Hyderabad

Fancy Number Hyderabad: ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్కీ నంబర్ లేదా న్యూమరాలజీ ప్రకారం తమకు నచ్చిన నంబర్‌ను ఎంచుకోవాలని కొందరు భావిస్తుంటారు. అంతేకాదు అందరికంటే ప్రత్యేకంగా నిలబడాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా పర్వాలేదని అనుకుంటారు. అలాంటి వారి కోసమే రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ) వేలంపాటలు నిర్వహించింది. ఇందులో భాగంగానే పలు ఫ్యాన్సీ నంబర్లను కొందరు పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. తాజాగా వేలంలో ఫ్యాన్సీ నంబర్లు అత్యధిక ధరకు దక్కించుకున్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో జరిగిన వేలంలో ఫ్యాన్సీ నంబర్లు భారీ మొత్తానికి ధర పలికాయి.

Read also: BRS Leaders: నేడు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సందర్శించనున్న బీఆర్ఎస్ టీం..

రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన వేలంలో టీజీ ’09 ఏ9999′ అత్యధికంగా రూ.19,51,111 పలికింది. హానర్స్ డెవలపర్స్ అనే కంపెనీ ఈ నంబర్‌ను సొంతం చేసుకోవడానికి భారీ మొత్తం చెల్లించింది. కొత్తగా ప్రారంభించిన TG09B సిరీస్‌లో, ‘0001’ నంబర్ ధర రూ. 8 లక్షల 25 వేల రూపాయలు, ఈ నంబర్‌ను ఎన్‌జి మైండ్ ఫ్రేమ్ కంపెనీ పొందింది. అదే సిరీస్‌లోని ‘0009’ నంబర్‌ను అమరం అక్షర రెడ్డి రూ.6,66,666 చెల్లించి సొంతం చేసుకున్నారు. AMR ఇండియా ‘0006’ నంబర్‌ను రూ.2,91,166కి సొంతం చేసుకుంది. ‘0005’ నంబర్‌ను గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.2,50,149కి తీసుకోగా, ‘0019’ నంబర్‌ను రూ.1.30 లక్షలు చెల్లించి మోల్డ్ టెక్ తీసుకుంది. వీటితో పాటు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ఖైరతాబాద్ రవాణాశాఖకు రూ. 51,17,517 ఆదాయం వచ్చినట్లు ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. ఫ్యాన్సీ నంబర్లతో ఖైరతాబాద్ రవాణా శాఖ రూ. 51,17,514 ఆదాయం సమకూరింది. టీజీ 09 A 9999 నంబర్ అత్యధికంగా రూ.19,51,111ను పొందింది. టీజీ 09 B 0001 నంబరుకు రూ. 8,25,000, టీజీ 09 B 0009 నం. రూ. 6,66,666, టీజీ 09 B 0006 నం. రూ. 2,91,166, టీజీ 09 B 0005 రూ. 2,50,149, టీజీ 09 B 0019 నంబర్ రూ.1,30,000కు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు.
What’s Today: ఈ రోజు ఏమన్నాయంటే?

Show comments