Telangana TET Notification: నేడు టెట్ నోటిఫికేషన్… జాబ్ కేలండర్ ప్రకారం నిర్వహణ..
- నేడు టెట్ నోటిఫికేషన్- జనవరి లో టెట్ ఎగ్జామ్..
- నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న విద్యాశాఖ..
- జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్ నిర్వహణ..
- ఈ ఏడాది ఇప్పటికే ఒక టెట్ నిర్వహించిన విద్యా శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TelanganaTET Notification: టెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గతంలో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మార్చి 14 న నోటిఫికేషన్ ఇచ్చి మే 20 నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో రెండో టెట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసి జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని గత ఆగస్టులో ఉద్యోగాల క్యాలెండర్ విడుదల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. జనవరిలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
Read also: Astrology: నవంబర్ 04, సోమవారం దినఫలాలు
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
గత మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షకు 2 లక్షల 86 వేల 386 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 2.35 లక్షల మంది రాశారు. 12 జూన్ న పలితాలు ప్రకటించగా.. వారిలో 1.09 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి డీఎస్సీ కూడా పూర్తి కావడంతో పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య కాస్త తగ్గుతుందని భావిస్తున్నారు. పరీక్షలు ఆన్లైన్లో ఉన్నందున, వారానికి కనీసం 10 రోజులు స్లాట్లు అందుబాటులో ఉండాలి. అందుకే సంక్రాంతి లోపు నిర్వహిస్తారా? ఆ తర్వాత? అనేది ఇప్పుడే చెప్పలేమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. టెట్ పేపర్-1కి డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత సాధించాల్సి ఉన్నందున వేలాది మంది సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు. టెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు పరీక్షలు నిర్వహించగా…పదోసారి జనవరిలో నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలిపి ఆరుసార్లు పరీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్ నిర్వహించడం విశేషం.
CM Revanth Reddy : తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!