Danam Nagender: బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి గాంధీ ఇళ్లే దొరికిందా? అని ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో పెట్టుకోండి అని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఆంధ్ర వాళ్ళ వ్యాపారాలు చేస్తే ట్యాక్సుల రూపంలో డబ్బులు కావాలి, వాళ్ళ ఓట్లు కావాలి, కానీ రాజకీయాల్లో మాత్రం ఆంధ్రా, తెలంగాణ అని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా, తెలంగాణ అనేది కౌశిక్ చెప్పిన మాటలా? లేక టిఆర్ఎస్ పార్టీ మాటల.? అని ప్రశ్నించారు.
Read also: Arvind Kejriwal’s Bail: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. సీబీఐ కేసులోనూ బెయిల్
శేరిలింగంపల్లి టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలంటే జిల్లా పార్టీ ఆఫీసులో చేయాలి.. లేదంటే తెలంగాణ భవన్ లో చేయాలని సూచించారు. అరికెపూడి గాంధీ ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయండని వాళ్ళు చెప్పేదేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని అన్నారు. కౌశిక్ రెడ్డికి మహిళలంటే లెక్కలేదన్నారు. మహిళల ప్రతాపం అతనికి పూర్తిస్థాయిలో తెలియదన్నారు. మా ఎమ్మెల్యే గాంధీ టిఫిన్ కి పిలిచాడు అందుకోసమే గాంధీ ఇంటికి వచ్చానని తెలిపారు. హారతులిచ్చి స్వాగతం పలుకుతామంటేనే గాంధీ, కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళాడని తెలిపారు. ప్రాంతీయ విభేదాలను కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం సరికాదని మండిపడ్డారు.
BRS Meeting: కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి.. గాంధీ ఇంట్లో ముగిసిన కార్యకర్తల సమావేశం