Site icon NTV Telugu

CM Revanth Reddy: అందెశ్రీ పాడే మోసిన సీఎం రేవంత్ రెడ్డి..

Rr

Rr

CM Revanth Reddy: సహజ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అంత్యక్రియలకు హాజరై కవికి కన్నీటి వీడ్కోలు చెప్పారు. ఇక, అందెశ్రీ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం ఆయన పాడెను స్వయంగా సీఎం మోశారు. ఈ సందర్భంగా అందెశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు రేవంత్. ఆయన వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, భారీ సంఖ్యలో అభిమానులు, సాహితీ ప్రియులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

Read Also: Andhra King Taluka : ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ టైటిల్ ప్రోమో రిలీజ్.. ఎనర్జీతో మెప్పించిన రామ్‌

ఇక, తెలంగాణ ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయే కవి అందెశ్రీ గౌరవం దక్కింది. అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం, గాల్లో మూడు రౌండ్ల కాల్పులు జరిపి తమ గౌరవాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఊపిరి పోసిన అందెశ్రీకి దక్కిన ఈ గౌరవం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version