NTV Telugu Site icon

CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు తేలాల్సి ఉంది..

Cm Revanth Reddy Golkonda Fort

Cm Revanth Reddy Golkonda Fort

CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు కూడా తేలాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. అయితే.. వాటిని పరిష్కరించేందుకు గత దశాబ్దకాలంగా ఏవిధమైన ప్రయత్నాలూ జరగక పోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు కూడా తేలాల్సి ఉందని.. మా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇందుకోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో స్నేహపూర్వకంగా, సఖ్యతతో వ్యవహరిస్తున్నాం. రాష్ట్ర విభజనానంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను సత్వరం పరిష్కరించు కోవడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నామన్నారు.

Read also: Rythu Bharosa: గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. త్వరలో రైతు భరోసా..

నేరం రూపం మార్చుకుంది. సైబర్ నేరాలు, డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ నేరాల వల్ల వ్యక్తులు కాదు… మొత్తం జాతే నిర్వీర్యం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఆందోళన కరమైన అంశం. మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూడదని, కనపడకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. డ్రగ్స్ నియంత్రణ, నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తున్నాం. తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (టీ-న్యాబ్)ను బలోపేతం చేశాం. సైబర్ మోసాలు, నేరాల బారిన పడిన వారికి సత్వర సహాయం అందించేందుకు 1930 నెంబర్ 24 గంటలు పని చేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అంగన్వాడి లను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నామన్నారు.

Read also: CM Revanth Reddy: తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు..

ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో చేయాలని సంకల్పించాం. పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 65 ప్రభుత్వ ఐ.టి.ఐ లను టాటా సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాం. ఇటీవలే బేగరి కంచె వద్ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. తెలంగాణ విద్యా రంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతోంది. మన పిల్లల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతోంది. సరికొత్త నైపుణ్యాలతో ఉపాధికి గ్యారెంటీ ఇవ్వబోతోంది. ఈ యూనివర్సిటీకి మహింద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్ గా నియమించాం. రంగుల మేడలు, అద్దాల గోడలు కాదు. ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పులు రావాలని తెలిపారు.

Read also: CM Revanth Reddy: ఆడబిడ్డల కోసం మహాలక్ష్మీ పథకంలోని మరో పథకం 500లకే వంట గ్యాస్..

దానికి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరగాలి. తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి. తెలంగాణ బ్రాండ్ ను విశ్వవేదిక పై సగర్వంగా చాటాలి. అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను, శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో భేటీ అయ్యాం. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించాం. ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం. బేగరి కంచె వద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, మెట్రో విస్తరణ, తదితర ఆలోచనలను వారితో పంచుకున్నాం. జనవరిలో దావోస్ పర్యటనలో భాగంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డు. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది. మన యువత ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఇవి దోహదం చేస్తాయని మేం విశ్వసిస్తున్నాం. కొత్త నగర నిర్మాణమే కాదన్నారు.

Read also: Medical Services: నిలిచిన వైద్యసేవలు.. అత్యవసర పరీక్షలు సైతం అందక గర్భిణీల అవస్థలు

ఉన్న నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి హైడ్రా అని కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించిన పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించాం. దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కబ్జాలకు గురికాకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పని చేస్తుంది. సర్కారు ఆస్తుల పరిరక్షణతోపాటు, విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత హైడ్రాకు పెట్టాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి, ఇప్పటికే గ్రూప్-1 ప్రాథమిక పరీక్షను విజయవంతంగా జరిపించాం. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ ని విజయవంతంగా నిర్వహించాం. ఉద్యోగ నియామక వయోపరిమితిని కూడా 44 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళకు పెంచాం. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్లను పరిష్కరించామని తెలిపారు.

Read also: Sitarama Project: దశాబ్దాల సాగు నీటి కల సాకారం.. సీతారామ ప్రాజెక్ట్‌ కు సీఎం రేవంత్ ప్రారంభోత్సవం..

ఇటీవలే శాసనసభలో జాబ్ క్యాలెండర్ ను ప్రవేశ పెట్టాం. దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా. మీ సమస్యలు ఏమైనా ఉ ంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకో వద్దు. ఎవరి ఉద్యోగాల కోసమో… మీ జీవితాలను బలి చేసుకోవద్దు. ఇప్పటికే గడచిన పదేళ్లుగా మీరు చాలా నష్టపోయారు. పెద్దన్నగా మీకు నేను అండగా ఉంటా. సింగరేణి సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువతకు లక్ష రూపాయల వంతున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళలను వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసిందన్నారు.

Read also: DSC Recruitment Process: సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ..?

స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం ద్వారా మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తినైపుణ్య శిక్షణ ఇప్పించి, బ్రాండింగ్, మార్కెటింగ్లలో మెళకువలు పెంపొందించే సౌకర్యాలు కల్పిస్తాం. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణబీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద సభ్యురాలు ఎవరైనా మరణించినప్పుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీచేయడం జరుగుతుంది. స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు స్కూల్ యూనిఫారాలు కుట్టే పనిని అప్పగించడంతో పాటు, వారి ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్ లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు 10 లక్షల ప్రమాద జీవిత బీమా చేయడం జరిగిందన్నారు.

Read also: CM Revanth Reddy: నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. సీఎం రేవంత్‌ రెడ్డి బిజీ షెడ్యూల్‌..

ఇది ప్రజా ప్రభుత్వం. ప్రతి ఒక్కరి ప్రభుత్వం. స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ… ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ… సంక్షేమానికి పెద్దపీట వేస్తూ… విశ్వ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలిపే పాలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తూ… దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ… మరొక్కసారి అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. చివరిగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపాం. 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30 వేల మందికి పైగా నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి ఈ పర్యటన ద్వారా పరిచయం చేశాం. ఇదొక గొప్ప ముందడుగు. భవిష్యత్ లో తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుతుందని… రైతులు, యువత, మహిళ, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, సకల జనులు సుఖశాంతులతో శోభిల్లే తెలంగాణగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని హామీ ఇస్తూ… అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Traffic Alert: అలర్ట్‌.. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు