Site icon NTV Telugu

Fake PMO Official: పీఎంఓ అధికారిగా నటించి మోసాలకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు..

Fake Pmo

Fake Pmo

Fake PMO Official: హైదరాబాద్ లో పీఎంఓ అధికారిగా నటించి మోసాలకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు అయింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. PMOలో సీనియర్ అధికారిగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. టీటీడీలో సుప్రభాత దర్శనం కోసం రామారావు సిఫార్సు లేఖ రాశాడు. కర్ణాటకలోని రెవెన్యూ అధికారులకు లేఖ రాసి భూముల రికార్డులు కావాలని రామారావు కోరారు. ప్రముఖ యూనివర్సిటీకి లేఖ రాసి అడ్మిషన్ కావాలని సిఫార్సు చేశాడు. పీఎంఓ కార్యాలయాన్ని టీటీడీ సంప్రదించింది. ఇక, రామారావు పేరుతో డిప్యూటీ సెక్రటరీ ఎవరూ లేరని పీఎంవో తెలిపింది. పీఎంఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసింది.

Exit mobile version