Site icon NTV Telugu

Boora Narsaiah Goud: రాజీనామా చేస్తావా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బూర నర్సయ్య సవాల్

Boora Narsaiah Goud

Boora Narsaiah Goud

Boora Narsaiah Goud: నీకు దమ్ము ధైర్యం ఉంటే.. నీ మంత్రి పదవికి రాజీనామా చేస్తావా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సవాల్ చేశారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అన్న వారిని చెప్పుతో కొడతాం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, లింగోజి గూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాకంటే ముందున్న ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు భువనగిరి పార్లమెంట్లో అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. భువనగిరిలో బీజేపీ గెలవకపోతే శాశ్వతంగా రాజకీయాసన్యాసం చేస్తా అన్నారు.

Read also: Em Chesthunnav OTT: ఓటీటీలోకి మరో లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నీకు దమ్ము ధైర్యం ఉంటే.. నీ మంత్రి పదవికి రాజీనామా చేస్తావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని సవాల్ విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వర్తమానంలో లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అదే చెబుతున్నాయని, అలా మాట్లాడేవారిని చెప్పుతో కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధికి బీబీనగర్ ఎయిమ్స్, ఎంఎంటీఎస్ రైలు, కేంద్రీయ విద్యాలయం, 520 కి.మీ జాతీయ రహదారులు తీసుకొచ్చామని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అండగా నిలవాలని కోరారు. భువనగిరి అభివృద్ధి తమ వల్లేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాదు భువనగిరిలో బీజేపీ గెలవకపోతే శాశ్వత రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. నేను గెలిస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని కోరారు. ఈ సవాల్‌ని స్వీకరించే దమ్ము, ధైర్యం కోమటిరెడ్డికి ఉందా అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
Anupama Parameswaran: కలువ పువ్వు లాంటి కళ్ళతో మాయచేస్తున్న అనుపమ పరమేశ్వరన్..

Exit mobile version