Big Breaking: ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులతో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ వాగ్వాదానికి దిగారు. గణేష్ వెహికిల్ కి ఉత్సవ కమిటీ సభ్యులు అడ్డంగా కూర్చున్నారు. కమిటీ సభ్యులకు పోలీసులు నచ్చజెప్తున్న ధర్నా చేపట్టారు. వడివడిగా కదిలిస్తున్నారని కమిటీ సభ్యుల వెల్లడించింది. కనీసం భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పించడం లేదని గణేశ్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. భక్తులకు దర్శించుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దర్శనానికి అనుమతిని ఇస్తే ఆలస్యం అవుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితిల్లో మద్నాహ్నం 1గంట లోపు గణేషున్ని నిమజ్జనం చేయాలని కోరారు. ప్రశాంతంగా ఖైరతాబాద్ గణేష్ ని విగ్రహం కదులుతుందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ధర్నాలు చేయడం మంచిది కాదని కోరారు. అయినా పోలీసుల మాటలను పట్టించుకోకుండా భక్తులకు దర్శించుకునే అవకాశం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. దీంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఉద్రిక్తల నడుమ ఖైరతాబాద్ గణేషుని శోభయాత్ర కొనసాగుతుంది.
Kishan Reddy: నేడు నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు..