NTV Telugu Site icon

Bandi Sanjay: అల్లుడి కోసమే మూసీ డ్రామా.. సీఎంపై తీవ్ర విమర్శలు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: అల్లుడి కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ బాధితులకోసం బీజేపీ నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. లండన్, సీయోల్ కాదు…. మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్ అన్నారు. సబర్మతి, నమామి గంగతో మూసీకి పోలికా? అని ప్రశ్నించారు. సబర్మతి, నమామి ఖర్చు కు, మూసి అంచనాకు పోలిక ఎక్కడ? అని మండిపడ్డారు. మీ అల్లుడి(వాద్రా) కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా మీకు అండగా ఉంటామన్నారు.

Read also: Sangareddy: కస్తూర్బా గురుకులంలో 11 మంది విద్యార్థినిలకు అస్వస్థత..

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి 287 కి.మీలు ప్రవహిస్తున్న మూసీ… డ్రైనేజీ నీటితో దాదాపు 12వేల పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలతో విషంగా మారిన మూసీ అని తెలిపారు. పాదయాత్రలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో విషం చిమ్ముతూ ఎగిసిపడుతున్న మూసీని, జనం బాధలను కళ్లారా చూసినం అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్సే కారణం అన్నారు. మూసీ ప్రక్షాళన ఓ జోక్… 1997లో ప్రక్షాళన పేరుతో డ్రామాలు… కర్మన్ ఘాట్ లో ‘‘నందనవనం’ అన్నారు. 2005లో ‘‘సేవ్ మూసీ క్యాంపెయిన్’’ పేరుతో హంగామా… నేష‌న‌ల్ రివ‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ ప్లాన్‌ (NRCM), JNNURM, జైకా, జపాన్ నిధుల ఖర్చు… 2014 వరకు సమైక్య పాలనలో కొనసాగిన దోపిడీ అన్నారు. కేటీఆర్ పాలనలో 16 వేల 634 కోట్లతో ’మూసీ సుందరీకరణ’ డ్రామా… హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్లు… ‘మూసీ రివర్‌ఫ్రంట్‌’ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 8 వేల 500 పైచిలుకు అక్రమ కట్టాడాల గుర్తించారు. 15 వేల మంది నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీ అన్నారు. అడుగు ముందుకు పడలే… మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటుతో రాజకీయ పునరావాసం.. తెలంగాణ సొమ్ము కర్నాటక, మహారాష్ట్ర, పంజాబ్ పాలయ్యాయని తెలిపారు.

Read also: Shamshabad Airport: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్.. భయాందోళనలో ప్రయాణికులు..

ఇగ ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు… మూసీ ప్రక్షాళన… సుందరీకరణ… ఇప్పుడు పునరుజ్జీవం… లక్షనర్నర కోట్లు ఖర్చు చేసి లండన్ లోని థేన్స్ మాదిరిగా మారుస్తనని సీఎం అంటే… మంత్రులేమో దక్షిణ కొరియా సియోల్ లోని ‘చంగ్ ఏ చంగ్’ నదిలా మారుస్తామంటున్నారని తెలిపారు. మూసీని అడ్డుపెట్టుకుని కబ్జా చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతల బిల్డింగ్ ల జోలికి పోయే దమ్ముందా? అని సవాల్ విసిరారు. పేదల ఇండ్ల జోలికొస్తే ఖబడ్డార్. వాళ్ల ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు పెడతామాన్నారు. బుల్డోజర్లు రావాలంటే మమ్ముల్ని దాటిపోవాలే అన్నారు. మూసీ ప్రక్షాళనకు సబర్మతి నదితో పోలికా? నమామి గంగే ప్రాజెక్టుతో పోలికా? సబర్మతికి 7 వేల కోట్ల ఖర్చు అని తెలిపారు. వందల కి.మీల పొడవున్న నమామి గంగేకు 40వేల కోట్లు మాత్రమే ఖర్చు అన్నారు. మూసీ ప్రాజెక్టు లక్షన్నర కోట్లు ఎందుకు? కిలోమీటర్ కు 2 వేల కోట్ల ఖర్చు ఎందుకు? అని ప్రశ్నించారు. అల్లుడి కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం కాదన్నారు. దేశంలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునరుజ్జీవింప చేసేందుకే తెలంగాణ సొమ్మును ఖర్చు చేయాలని చూస్తున్నరని తెలిపారు. కాంగ్రెస్ దోపిడీని అడ్డుకుని తీరుతామన్నారు.
KTR: వారికి వారే చంపుకుంటున్నారు.. జగిత్యాల ఘటనపై కేటీఆర్‌ కీలక కామెంట్..