Site icon NTV Telugu

Bandi Sanjay: మమ్మీ, డాడీ కల్చర్ మనకొద్దు… అమ్మానాన్నే ముద్దు..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: మమ్మీ, డాడీ కల్చర్ మనకొద్దు.. అమ్మానాన్నే ముద్దు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు హైదరాబాద్ కిస్మత్ పురా రోడ్ లోని బండ్లగూడ జాగీర్ వద్దనున్న శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం ఆవరణలో నిర్మించిన నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. జగన్ తీరు హిందుత్వంపై దాడి అన్నారు. డిక్లరేషన్ ఇస్తే తప్పేంది? అని ప్రశ్నించారు. అన్యమతస్తులు హిందూ ఆలయాల్లోకి ప్రవేశిస్తే డిక్లరేషన్ ఇచ్చిన ఉదంతాలెన్నో ఉన్నాయ్ అన్నారు. దళితులు అసలైన హిందూ ధర్మ రక్షకులు అని తెలిపారు. దళితులను క్రిస్టియన్లు గా మార్చే కుట్ర సాగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తినేటోళ్లను, నక్సలైట్ల భావజాలమున్న వాళ్లను విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా? అని మండిపడ్డారు.

మమ్మీ అంటే దెయ్యం… డాడీ అంటే గాడిద అని మాట్లాడారు. మమ్మీ, డాడీ కల్చర్ మనకొద్దు… అమ్మానాన్నే ముద్దు అంటూ సూచించారు. ర్యాంకుల కోసం బట్టీ చదువులకే ఎక్కువ గౌరవమెందుకు అన్నారు. ఉగ్రవాద బీజం వేస్తున్న మదర్సాలకు సాయం చేయడమేంది? అని ప్రశ్నించారు. విజ్ఙానంతోపాటు దేశభక్తి, క్రమశిక్షణ నేర్పే శిశు మందిర్ లను విస్మరిస్తారా? అని అన్నారు. ‘హైడ్రా’తో కాంగ్రెస్ తలగొక్కోంటోందన్నారు. ‘మూసీ’ హైడ్రా కూల్చివేతలు, 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు నిధులే కాంగ్రెస్ కొంప ముంచబోతున్నయ్ అని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై మెడలొంచేందుకు పోరాటాలు చేస్తామన్నారు. స్థానిక ఎన్నికల తరువాత స్థానిక ప్రజా ప్రతినిధులతో ఛలో హైదరాబాద్ మార్చ్ నిర్వహిస్తామన్నారు. జగన్ అబ్దుల్ కలాం కంటే తోపా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి హోదాలోనే కలాం డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. జగన్ తీరు చూస్తుంటే లడ్డూలను కల్తీ చేసినట్లు కన్పిస్తోందన్నారు.
KTR Tweet: 36 గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న.. కేటీఆర్‌ కీలక ప్రకటన..

Exit mobile version