Shamshabad Airport: అక్కడక్కడా రోడ్లపై జనాలు కొట్టుకోవడం మామూలే. చిన్న విషయాల నుండి పెద్ద గొడవల దాకా.. చిన్న పెద్ద అని తేడా లేకుండా దాడులు చేసుకోవడం అక్కడక్కడ కనిపిస్తుంటాయి. కానీ.. ఓ ఫ్యామిలీ ఎయిర్ పోర్టులో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఘటన ప్రయాణికులు బిత్తరపోయేలా చేసింది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.
Read also: Ticket Collector: టీసీని చితకబాదిన ప్రయాణికుడు.. వైరల్ వీడియో..
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అరవిల్ పాయింట్ లో ఓ ప్యామిలీ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అంతమంది ముందు ఓ మహిళపై ఓ వ్యక్తి చేయి చేసుకోవడంతో మహిళ బంధువులు ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఇంతలో ఎయిర్ పోర్టు పోలీసులు ఇద్దరిని అక్కడి నుంచి పంపించారు. మళ్ళీ పార్కింగ్ లో కొట్టుకోవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వీరి మొత్తం సమాచారం సేకరించి కేసు నమోదు చేశారు. అయితే ఈ గొడవ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కాదు డెహ్రాడూన్ నుంచే ప్రారంభమైందని సమాచారం. రెండు ఫ్యామిలీలు అక్కడి ఎయిర్‌పోర్ట్ లో కొట్టుకున్నారు. అక్కడ సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆ రెండు ఫ్యామిలీలను తిట్టి పంపారు. ఫ్లైట్ ఎక్కిన ఆ తరువాత కూడా గొడవ పడ్డారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగగానే మళ్లీ ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. ఈ గొడవకు గల కారణం కుటుంబ సమస్యలే అని సమాచారం. డెహ్రాడూన్ లో అమ్మాయిని వేధించారని కారణంతో హైదరాబాద్ చేరుకునేంత వరకు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఆర్జిఐ పోలీస్ స్టేషన్ల ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు. ఇద్దరి కుంటుంబంలోని కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sourav Ganguly: ఇది దారుణం.. సౌరవ్ గంగూలీపై బెంగాలీ నటి ఆగ్రహం!
